టాలీవుడ్ లెజెండరి యాక్టర్ తెలుగు జాతి గర్వపడే నటుడు నందమూరి రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎంతో మంది హీరోలకు, హీరోయిన్లకు ఆదర్శంగా ఇంకా మార్గదర్శిగా నిలిచారు. ఆర్థిక పరమైన అంశాల్లోనే కాకుండా.. అనేక విషయాల్లో వారికి సలహాలు సూచనలు కూడా ఇచ్చేవారు ఎన్టీఆర్.ఇండస్ట్రీలో ఆయన్ని అందరూ అన్నగారు అని పిలుస్తారు. ఇలా అన్నగారి సలహాలతో ఎంతో మంది ఎన్నో రకాల ఆస్తులు సంపాయించుకున్నవారు.. సినీ రంగంలో తమకంటూ.. ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నవారు ఉన్నారు. అయితే.. ఒక హీరోయిన్ మాత్రం అన్నగారి మాటను పెడచెవిన పెట్టి.. ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకుందని.. సినీ ఫీల్డ్‌లో ఇప్పటికీ ఒక టాక్ నడుస్తూనే ఉంది.
Advertisement
ఆ హీరోయినే.. కాంచన.పాత సినిమాల్లో సావిత్రి, అంజలీదేవి, భానుమతిలు ఫాంలో వున్న సమయంలో బాల నటిగా పరిచమైంది. తర్వాత.. కాలంలో పుంజుకుని హీరోయిన్‌గా కూడా రాణించిన కాంచనది ఆంధ్రప్రదేశే. ఈ అభిమానంతోనే ఎన్టీఆర్ అందరికీ చెప్పినట్టే అనేక సలహాలు ఆమెకు కూడా చెప్పారు. ముఖ్యంగా అప్పట్లో ఇప్పుడు ఇస్తున్న మాదిరిగా రెమ్యునరేషన్లు డిమాండ్ చేసే పరిస్థితి లేదు. సినీ నిర్మాతలు ఇచ్చిన సొమ్ముతోనే సరిపుచ్చుకోవాలి.
Advertisement
ఆ వచ్చే మొత్తంలో అంతో ఇంతో దాచుకోమని ఎన్టీఆర్ అందరికీ సలహాలు ఇచ్చేవారు.ఇక అంతేకాదు.. కుటుంబాలను కూడా నమ్మవద్దని ఆయన చెప్పేవారు. మరీ ముఖ్యంగా సినిమాల్లో పరిచయం అయిన వారితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలని చెప్పేవారు. ఆయన కూడా వీటిని ఖచ్చితంగా పాటించేవారు. అయితే..ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలను శారద, భానుమతి (అప్పటికే ఆవిడ ఆర్థికంగా బలంగా ఉన్నారు), అంజలీదేవి వంటి హీరోయిన్లు పాటించారు. ఆర్థికంగా బలోపేతం అయ్యారు. అయితే.. కాంచన మాత్రం మితిమీరిన దాన ధర్మాలు చేయడం ఇంకా తన కొడుకులకు పూర్తిగా స్వతంత్రం ఇచ్చేయడం.. తన భర్తకు తన ఆర్థిక విషయాల్లో పూర్తిగా స్వేఛ్చను ఇచ్చేశారు.దీంతో సినిమాలు తగ్గిపోయి పూర్తిగా కుంగిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ హైదరాబాద్‌లో ఉచితంగా స్థలం ఇస్తాను రమ్మని ఆయన ఆహ్వానించారు. అయితే.. ఆమె ఆయన ఆహ్వానాన్ని కూడా ఆమె తిరస్కరించారు. ఎందుకంటే.. అప్పటి దాకా ఎన్టీఆర్ చెప్పింది పాటించనందున తాను నష్టపోయానని భావించి కొంత ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆ సాయాన్ని కూడా పక్కన పెట్టిన ఎన్టీఆర్ తాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో కాంచనకు అవకాశం ఇచ్చారు.అలాగే ఆమెకు మంచి రెమ్యూనరేషన్ ఇప్పించారు. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలకు దూరమయ్యారు. కేవలం తమిళ సినిమాలకే పరిమితమయ్యారు. ఇదే విషయాన్ని తన చివరి రోజుల్లో పలు చానెళ్లకు ఇచ్చి ఇంటర్యూల్లోనూ కాంచన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆదరణ.. దూరదృష్టి గురించి.. తలుచుకుని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.