Home » నెలాఖరులోగా పీఆర్‌సీ : స‌జ్జ‌ల

నెలాఖరులోగా పీఆర్‌సీ : స‌జ్జ‌ల

by Sravan Sunku
Published: Last Updated on
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్‌సీ నివేదిక‌పై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పీఆర్‌సీ ప్రక్రియ ప్రారంభం అయింద‌ని వెల్ల‌డించారు. అత్యంత త్వ‌ర‌లోనే పీఆర్‌సీ నివేదిక‌పై శుభ‌వార్త ఉంటుంద‌ని వివ‌రించారు. సీఎం జ‌గ‌న్‌తో సీఎస్ సమీర్‌ శర్మ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. న‌వంబ‌ర్ నెలాఖ‌ర్ వ‌ర‌కు దీనిపై ప్ర‌క‌ట‌న చేయాల‌నుకుంటున్నామ‌ని చెప్పారు. కానీ ఇప్ప‌టికే చాలా ఆలస్యం అయింద‌ని వివ‌రించారు స‌జ్జ‌ల‌.

Advertisement

న‌వంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్క‌రించాల‌న్న‌ది ప్ర‌భుత్వం యొక్క ఆలోచ‌న అని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించిన‌ట్టు గుర్తు చేశారు. క‌రోనా కార‌ణంగా ఆర్థిక ప‌రిస్థితి చిన్నాభిన్నం కావ‌డం మూలంగానే పీఆర్‌సీ, సీపీఎస్ ర‌ద్దు అంశాలు పెండింగ్‌లో ఉన్న‌ట్టు వెల్ల‌డించారు స‌జ్జ‌ల‌. ఇక నుంచి వేత‌నాలు స‌క్ర‌మంగా ఇవ్వ‌డానికి ప్రాధాన్యం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సూచించిన‌ట్టు తెలిపారు.

Advertisement

ఇవి కూడా చదవండి: పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. 14 మంది ఎమ్మెల్యేలపై వేటు..!

Visitors Are Also Reading