ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా డీజే టిల్లు. ఈ సినిమాలో సిద్దు జొన్నగడ్డల హీరోగా నటించారు. నేహాశర్మ హీరోయిన్ గా నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ లో హీరోయిన్ పై సినిమా జర్నలిస్ట్ సురేష్ కొండేటి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
Advertisement
Advertisement
హీరోయిన్ కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో లెక్కపెట్టారా అంటూ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని సిద్ధు జొన్నగడ్డల నో కామెంట్స్ అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని అంతా మర్చిపోయారు కూడా. అయితే తాజాగా నటి కరాటే కల్యాణి ఈ విషయం పై స్పందించారు. కరాటే కల్యాణి మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కరాటే కల్యాణి మాట్లాడుతూ డీజే టిల్లు హీరోయిన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు దారుణమని అన్నారు.
రాబోయే రోజులలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఈ వివాదం పై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తెలిపారని చెప్పారు. హీరోయిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సురేష్ కొండేటి పై చర్యలు తప్పవని కరాటే కల్యాణి స్పష్టం చేసారు.