Home » పంజాబ్ నూత‌న ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యం..!

పంజాబ్ నూత‌న ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యం..!

by Anji
Ad

ఇటీవ‌లే పంజాబ్ కొత్త ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన భ‌గ‌వంత్ మాన్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. పంజాబ్‌ను ఉడ్తా పంజాబ్ కాకుండా భ‌డ్తా పంజాబ్‌, ఉట్తా పంజాబ్‌గా చేస్తానంటూ ప్ర‌క‌టించిన భ‌గ‌వంత్ మాన్ ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచే ప‌లు కీల‌క నిర్ణ‌యాలను ప్ర‌క‌టిస్తున్నారు. పంజాబ్ కొత్త సీఎం అధికారం చేప‌ట్టిన కొద్దిరోజుల్లోనే ప్ర‌భుత్వ రంగంలో ఖాళీగా ఉన్న‌టువంటి 25వేల ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

Advertisement

వెంట‌నే ఇంటింటికి రేష‌న్ డెలివ‌రీ స‌దుపాయం క‌ల్పిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిచ్చే మ‌రొక కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు ఏవీ ఫీజులు పెంచ‌కుండా నిషేదం విధించ‌డంతో పాటు త‌క్ష‌ణ‌మే ఆ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. కొత్త విద్యా సంవ‌త్స‌రానికి అడ్మిష‌న్లు ప్రారంభం కానున్న స‌మ‌యంలో ప్ర‌యివేటు విద్యాసంస్థ కూడా ఫీజులు పెంచొద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

దీంతో పాటు పుస్త‌కాలు, యూనిఫాం వంటివి తాము చెప్పిన చోట‌నే కొనాలంటూ త‌ల్లిదండ్రుల‌పై ఒత్తిడి తీసుకురావ‌ద్దంటూ ఆయ‌న సూచించారు. విద్యారంగానికి సంబంధించి ఈరోజు రెండు కీల‌క నిర్ణ‌యాలు ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు భ‌గ‌వంత్ మ‌న్ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. విద్యారంగంపై దృష్టి పెట్టి పంజాబ్ సీఎం త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి విధి విధానాల‌ను రూపొందిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

ఇటీవ‌లే ఐదు రాష్ట్రాల‌కు జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాల‌కు 92 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. పంజాబ్లో భారీ మెజారిటీ సాధించ‌డంతో భ‌గ‌వంత్ మాన్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. పంజాబ్ అభివృద్ధికి కావాల్సిన స‌మూల ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని భ‌గ‌వంత్ మాన్ ప్ర‌మాణ స్వీకారం రోజు ప్ర‌క‌టించారు. చెప్పిన విధంగానే ఆయ‌న కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : RRRలో “లోకి” పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా…? జకన్న ఎలా ఆఫర్ ఇచ్చారంటే….!

Visitors Are Also Reading