కరోనా విజృంభణ సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా పదే పదే గుర్తుండేలా కాలర్ ట్యూన్ ను కరోనా కాలర్ ట్యూన్ గా మార్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాభచ్చన్ ఈ కాలర్ ట్యూన్ కు వాయిస్ ను అందించారు. గత రెండేళ్లుగా ఫోన్ చేస్తే ఇదే కాలర్ ట్యూన్ వినిపిస్తోంది.
Advertisement
Advertisement
అయితే ఇప్పుడు ఈ కాలర్ ట్యూన్ కు ఎండ్ కార్డు పడే సమయం వచ్చేసింది. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముకం పట్టడంతో కాలర్ ట్యూన్ కు స్వస్తి చెప్పాలని కేంద్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాక ఈ నిర్నయం తీసుకోవడానికి మరో కారణం కూడాఆ ఉంది. కరోనా కాలర్ ట్యూన్ ను నిలిపివేయాలంటూ టెలికాం సంస్థలకు కస్టమర్ ల నుండి వినతులు వస్తున్నాయట.
దాంతో టెలికాం సంస్థలు కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. దాంతో కాలర్ ట్యూన్ నిలిపివేయాలని కేంద్ర సర్కార్ పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా ఆంక్షలను కూడా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా మార్చి 31 నుండి కేవలం భౌతిక దూరం పాటించడం..మాస్కులు ధరించడం లాంటి నిబంధనలు మాత్రమే అమలు చేయాలని నిర్నయించారు.