Home » IMAX ఓన‌ర్ …ఒక‌ప్పుడు సినిమా హల్ గేట్ కీప‌ర్! స‌క్సెస్ స్టోరి

IMAX ఓన‌ర్ …ఒక‌ప్పుడు సినిమా హల్ గేట్ కీప‌ర్! స‌క్సెస్ స్టోరి

by Azhar
Ad

LV ప్ర‌సాద్ IMAX ఓన‌ర్.! ఒక‌ప్పుడు జేబులో 100 రూపాయ‌ల‌తో ముంబాయి వెళ్లి సినిమా అవ‌కాశాల కోసం కాళ్ల‌రిగేలా తిరిగాడు. నెలకు 15 రూపాయల జీతానికి ఒక ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీలో సహాయకుడిగా చేరాడు. అదే స‌మ‌యంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు కూడా పోషించాడు. కొన్ని రోజుల‌ త‌ర్వాత‌ సినిమా అవకాశాలు రాక‌పోవ‌డంతో పూటగ‌డ‌వ‌డం కోసం డ్రీము ల్యాండ్ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరాడు LV ప్ర‌సాద్.


1943 లో త్రిపురనేని గోపిచంద్ దర్శకత్వంలో గృహప్రవేశం అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన LV ప్ర‌సాద్ అనుకోని కార‌ణాలరీత్యా ఆ సినిమాకు దర్శకుడి గా, హీరోగా చేయాల్సివ‌చ్చింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

Advertisement

Advertisement

 

  • పల్నాటి యుద్ధం అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్న గూడవల్లి రామబ్రహ్మం అనారోగ్య కార‌ణాల రీత్యా త‌ప్పుకోగా ఆ సినిమా డైరెక్ష‌న్ ఛాన్స్ LV ప్ర‌సాద్ కు ద‌క్కింది. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ సాధించింది.

 

  • అటు త‌ర్వాత “ద్రోహి అనే సినిమాలో కూడా అనుకోకుండా ఒక ముఖ్య పాత్ర‌తో పాటు సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ద‌క్కింది.

 

  • 1949 లో మన దేశం సినిమా ద్వారా ఎన్టీఆర్ ను ప‌రిచ‌యం చేసిన LV ప్ర‌సాద్ షావుకారు,సంసారం, మిస్సమ్మ లాంటి అనేక హిట్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 

  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్ర‌హీత అయిన LV ప్ర‌సాద్ తొలి హిందీ టాకీ అయిన ఆలంఆరాలో, తొలి తెలుగు టాకీ అయిన భ‌క్త‌ప్ర‌హ్లాద‌లో , తొలి త‌మిళ టాకీ అయిన కాళిదాస్ లో న‌టించారు.

Also Read: ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన టాలీవుడ్ సినిమాలు ఇవే…!

Visitors Are Also Reading