Tollywood Day 1 Collections: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ ఇండియాలోనే మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లు రాబట్టిన సినిమాగా రికార్డులు బద్దలు కొట్టింది.
Advertisement
ఈ సినిమాకు ఫస్ట్ డే దేశవ్యాప్తంగా రూ.135.5 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఈ సినిమా తరవాత ఏ ఏ సినిమాలు అత్యధిక కలెక్షన్ లను రాబట్టాయో ఇప్పుడు చూద్దాం.
Tollywood Day 1 Collections
దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లు రాబట్టిన రెండో సినిమా కూడా రాజమౌళిదే కావడం విశేషం. బాహుబలి పార్ట్ 2కు దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లు వచ్చాయి. ఈ సినిమాకు మొదటి రోజు రూ.122.5 కోట్ల కలెక్షన్ లు వచ్చాయి.
ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాకు మొదటిరోజు రూ.73.58 కోట్ల షేర్ వచ్చింది.
Advertisement
ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి పార్ట్ 1 కు ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.52.8 కోట్ల కలెక్షన్ లు వచ్చాయి.
మెగాస్టార్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.50.11 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈసినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.42.60 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.40.32 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
Also Read: IMAX ఓనర్ …ఒకప్పుడు సినిమా హల్ గేట్ కీపర్! సక్సెస్ స్టోరి