యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. భారీ విజువల్స్ తో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. బాలీవుడ్లో ఈ సినిమాకు మొదటి రోజు రూ.18 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
Advertisement
అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో రెండో రోజు రూ. 24 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండో రోజు ఈ సినిమాకు రూ.107 నుండి 137 కోట్ల మధ్య వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది. దాంతో రెండు రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Advertisement
ఇక ఆదివారం ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా బాహుబలి-2 ను ఈ సినిమా బీట్ చేస్తుందా లేదా అని అంతా అనుమానం వ్యక్తం చేశారు. కానీ మొదటి రోజు బాహుబలి-2 రికార్డులను బద్దలు కొట్టేసింది. భారీ అంచనాలతో ఈ సినిమా దూసుకుపోతోంది. అంతేకాకుండా ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయే అవకాశాలున్నాయని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.