పొరుగు దేశం శ్రీలంకలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడింది. దాంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో చికెన్ మొన్న 1000 వుండగా అది కాస్తా పెరిగి ఇప్పుడు 1500 లకు చేరుకుంది. దేశంలో అన్ని నిత్యావసరాల వస్తు ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ శ్రీలంక కు ఆపన్న హస్తం అందించింది. అత్యవసరంగా శ్రీలంక కు 40వేల టన్నుల డీజిల్ ను పంపించాలని నిర్ణయం తీసుకుంది.
Advertisement
Advertisement
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ దీన్ని రవాణా చేయనుంది. ప్రతి నెల పంపించే ఆయిల్ కు అదనంగా ఈ ఆయిల్ ను పంపిస్తున్నారు. ఇంధనం కొనుగోలు కోసం శ్రీలంక కు భారత్ కు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు 500 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇక కష్టాల లో ఉన్న శ్రీలంక కు సాయం చేయడాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. భారత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.