Home » పుష్ప పార్ట్-2 లో స‌మంత‌…ఐటమ్ సాంగ్ కు అందుకే ఒప్ప‌కుందా…!

పుష్ప పార్ట్-2 లో స‌మంత‌…ఐటమ్ సాంగ్ కు అందుకే ఒప్ప‌కుందా…!

by AJAY
Ad

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్ లో ఈ సినిమాను విడుదల చేయగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు మన దేశంతో పాటు ఇతర దేశాల క్రికెట‌ర్లు సైతం అల్లు అర్జున్ మేనరిజం అనుకరిస్తూ వీడియోలు చేశారు. ఆ వీడియోలు తెగ వైర‌ల్ అయ్యాయి.

samantha

samantha

దాంతో పుష్ప క్రేజ్ ఎల్లలు దాటింది. ఇక పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప పార్ట్ 1 లో స‌మంత‌ ఐటమ్ సాంగ్ తో ఆకట్టుకుంది. స‌మంత స్టెప్పులు వేసిన ఊ అంటావా పాట కూడా నెట్టింట హ‌ల్చ‌ల్ చేసింది. ఇక ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 ను సిద్ధం చేసే పనిలో మేక‌ర్స్ ఉన్నారు.

Advertisement

Advertisement

Samantha

Samantha

జూన్ లేదా జులైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో దిశా పటాని ఐటమ్ సాంగ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఐటెం సాంగ్ కోసం మరికొందరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే పార్ట్ 1 లో ఐటమ్ సాంగ్ చేసిన సమంత పార్ట్ 2 లో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకంఉడా పార్ట్ 2 లో ముఖ్యమైన పాత్ర కోస‌మే స‌మంత పార్ట్ 1 లో ఐట‌మ్ సాంగ్ చేసింద‌ని కూడా టాక్. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading