ఇండస్ట్రీలో ఓ హీరో రిజెక్ట్ చేయడం అదే కథలో మరో హీరో నటించి హిట్ కొట్టడం సహజం. అలా ఎన్నో సినిమాలో ఓ హీరో రిజెక్ట్ చేస్తే మరో హీరో చేతికి వెళ్లాయి. అయితే కొన్ని సినిమాలు హిట్ కాగా కొన్ని మాత్రం ఫ్లాప్ అవుతుంటాయి. విజయ్ దేవరకొండను స్టార్ ను చేసిన అర్జున్ రెడ్డి సినిమాకు నిజానికి ముందుగా దర్శకుడు అల్లు అర్జున్ ను అనుకున్నాడు. కానీ అల్లు అర్జున్ ఆ సినిమాకు ఓకే చెబుతారో లేదో ఆయన ఇమేజ్ వేరని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెనక్కితగ్గారట. ఆ తరవాత శర్వానంద్ కు అదే కథ చెప్పగా ఆయన రిజెక్ట్ చేశారు.
Advertisement
కానీ అదే కథను సందీప్ రెడ్డి విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి తీయగా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. అయితే అదే విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ కథను రిజెక్ట్ చేశారు. దాంతో ఆ కథ చరణ్ దగ్గరకు వెళ్లగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హిట్ కొడ్డాడు. ఆ సినిమా మరేదో కాదు.
Advertisement
వంశీపైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ అల్లు అర్జున్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎవడు. ఈ సినిమా కథను రాసింది వక్కంతం వంశీ…కాగా ఎన్టీఆర్ ను ఊహించుకుని ఈ కథను రాసుకున్నారట. అంతే కాకుండా ఈ కథను ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు వినిపించారట. కానీ వాళ్లు ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఎవడు సినిమా చరణ్ దగ్గరకు వెళ్లింది.
చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమాలో బన్నీ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలించింది. ఇదిలా ఉండగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25న విడుదల కాగా ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. బాహుబలి 2 రికార్డులను సైతం ఈ సినిమా బ్రేక్ చేసింది.