నందమూరి ఫ్యామిలీలో ఎన్టీరామారావు తరవాత మళ్లీ అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరో బాలయ్య. బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. అంతే కాకుండా బాలకృష్ణకు ఎన్టీఆర్ స్వయంగా నటనలో మెలుకువలు నేర్పించి మంచి నటుడిగా తీర్చిదిద్దారు. బాలయ్య సినిమా వచ్చిందంటే కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సెలబ్రేషన్స్ చేసుకునే స్థాయికి చేరుకున్నారు. ప్రతి హీరోకూ అభిమానులు ఉన్నా బాలయ్య కు ప్రాణమిచ్చే అభిమానులు ఉండటమే ప్రత్యేకత.
Advertisement
ఇక బాలయ్య కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రాగా కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి కూడా…అలా మధ్యలో ఆగిపోయిన బాలయ్య ఏది ఏ కారణం చేత ఆగిపోయిందన్నది ఇప్పుడు తెలుసుకుందాం..బాలయ్య హీరోగా మొదలైన ప్రతాపరుధ్రుడు సినిమా మధ్యలోనే ఆగిపోయింది. బాలయ్య కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ప్రతాపరుధ్రడు సినిమా ఆగిపోయింది. అప్పటికే బాలయ్య మూడు బ్లాక్ బస్టర్ లు అందుకున్నాడు. అంతే కాకుండా ఆరు సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.
Advertisement
ఇక ఆ తరవాత ప్రతాపరుధ్రుడు మొదలైంది. ఈ సినిమా పౌరానిక కథాంశం ఆధారంగా తెరకెక్కాల్సింది. ఈ సినిమాకు కోడి రమకృష్ణ దర్శకత్వం వహించగా అప్పట్లో టాక్ డైరెక్టర్ లలో ఒకరైన ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు. ఈ ముగ్గురి కాంబినేషన్ లోనే వచ్చిన మంగమ్మగారి మనవడు బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో ప్రతాపరుధ్రుడు పై అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ 60శాతం పూర్తి చేసి విక్రమసింహ భూపతి అనే టైటిల్ తో పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇంతలో సినిమా నిర్మాత గోపాల్ రెడ్డి తీవ్రఅనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.
దాంతో సినిమా నిర్మాణ భాధ్యతలను ఆయన కుమారుడు భార్గవ్ తీసుకున్నారు. కానీ విధి వెక్కిరించడంతో గోపార్ రెడ్డి కన్నుమూశారు. ఆ తరవాత ఆయన తనయుడు భార్గవ్ దర్శకుడు కోడిరామకృష్ణ, హీరోబాలకృష్ణలను కలిసి తన తండ్రి మొదలుపెట్టిన సినిమాను ఆయన లేకుండా పూర్తి చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. దాంతో అతడి సెంటిమెంట్ ను అర్థం చేసుకున్న బాలయ్య,కోడిరామకృష్ణ కూడా అడ్డు చెప్పలేదు. అలా ప్రతాపరుధ్రుడు సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఈ సినిమా వచ్చి ఉంటే బాలయ్య కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అయ్యుండేదని అప్పట్లో చెప్పుకునేవారు.