Home » పంచాయతీ సెక్రెటరీగా ట్రాన్స్​జెండర్​.. త‌మిళ‌నాడు చ‌రిత్ర‌లో తొలిసారి..!

పంచాయతీ సెక్రెటరీగా ట్రాన్స్​జెండర్​.. త‌మిళ‌నాడు చ‌రిత్ర‌లో తొలిసారి..!

by Anji
Ad

త‌మిళ‌నాడు తిరువ‌ళ్లూర్‌లో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ట్రాన్స్‌జెండ‌ర్ చంద‌న్ రాజ్ దాత్సాయ‌ని అరుదైన ఘ‌న‌త సాధించారు. ఇలా జ‌ర‌గ‌డం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావ‌డం గ‌మనార్హం. బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలిరోజే. ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండ‌ర్ల‌కు కూడా రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ‌లో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ విధులు చేప‌ట్ట‌డం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

Advertisement

చంద‌న్‌రాజ్ 2010 లో పూవిరుథ‌వల్లి అన్నంపేడు పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిగా నియ‌మితుల‌య్యారు. అప్పుడు పురుషుడిగానే ఉద్యోగంలో చేరారు. ఆ త‌రువాత ట్రాన్స్‌జెండ‌ర్ గా మారారు. ప‌రిపాల‌నా కార‌ణాల దృష్ట్యా 2015లో కోస‌వంపాల‌యంకు బదిలీ అయ్యారు. ఆ త‌రువాత విధుల‌కు హాజ‌రు కాలేదు. 2020లో మ‌ళ్లీ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి పోస్ట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మగ నుంచి ట్రాన్స్ జెండ‌ర్‌గా మారుతుండ‌డంతో మాన‌సిక ఇబ్బందులు తలెత్తి ఆఫీస్‌కు రాలేక‌పోతున్న‌ట్టు ద‌ర‌ఖాస్తులో వెల్ల‌డించారు.

Advertisement

చంద‌న్‌రాజ్ ప్ర‌స్తుతం పూర్తి ట్రాన్స్‌జెండ‌ర్ గా మారారు. మ‌ళ్లీ విధులు నిర్వ‌హించేందుకు సిద్ధం కావ‌డంతో జిల్లా క‌లెక్ట‌ర్ మాన‌వ‌తా దృక్ప‌థంలో ద‌ర‌ఖాస్తుకు అంగీకారం తెలిపారు. దీంతో ఎల్లాపురంలో కొడువెల్లి పంచాయ‌తీ స‌క్రెట‌రీగా చంద‌న్‌రాజ్ వాత్సాయ‌నిని తిరిగి నియ‌మించారు. విధుల్లో చేరిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్‌జెండ‌ర్ల టాలెంట్‌ను గుర్తించి ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్లు కూడా క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

Also Read :  అద‌ర‌గొడుతున్న‌ ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ ఫ‌స్ట్ లుక్ ..!

Visitors Are Also Reading