మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇంద్ర సినిమా కూడా ఒకటి. ఈ సినిమా వంద రోజులు థియేటర్లలో ఆడటంతో పాటూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ కెరీర్ కూడా ఇంద్రకు ముందు ఆ తరవాత అన్నట్టుగా మారిపోయింది. ఇక ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించగా అశ్వినిదత్ సినిమాను నిర్మించారు. అంతే కాకుండా మనిశర్మ సినిమాకు స్వరాలను సమకూర్చారు.
Advertisement
అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా వచ్చిన మృగరాజు సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు గుణశేకర్ దర్శకత్వం వహించగా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కంటే ముందు చిరు హీరోగా డాడీ సినిమా వచ్చింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
Advertisement
ఇక ఆ తరవాత ఫ్యాక్షన్ సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న బీ గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర రాగా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో మెగాస్టార్ వైట్ అండ్ వైట్ వేసుకుని కోరమీసం తో చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు చిరంజీవి ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. కాశీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ రాసిన మాటలు కూడా ప్లస్ గా నిలిచాయి.
మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్….ఆయన మ్యానరింజ్ థియేటర్ లో క్లాప్స్ కొట్టించాయి. అయితే ఈ సినిమాలో దర్శకుడు ఓ సన్నివేశం చిత్రీకరణలో పప్పులో కాలేశాడు. సినిమాలో హోలీ పండుగ జరుగుంది. అయితే అదేరోజు సినిమాలో చిరంజీవి సిస్టర్స్ వచ్చి రాఖీ కడతారు. అలా రెండు పండుగలను ఒకే రోజు చూపించి దర్శకుడు మిస్టేక్ చేశాడు. అయితే ఇప్పుడు గుర్తు పట్టిన నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.