Home » తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. జూన్ 12న ప‌రీక్ష

తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. జూన్ 12న ప‌రీక్ష

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష కు నోటిఫికేషన్ విడుదలయింది. ఈనెల 26 నుంచి జూన్ 12 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 12న పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యా శాఖ పేర్కొంది. ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే విద్యాశాఖ టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

Also Read :  ధ‌నుష్ పేరును తొల‌గించిన ఐశ్వ‌ర్య‌…ఇక క‌లిసేది లే అంటూ క్లారిటీ…!

Advertisement

Advertisement


ఇదిలా ఉండ‌గా ఒకసారి టెట్ లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటి వరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్‌ రాసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌ లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాశాఖ ప్రకారం మార్పు చేసింది. 2011, ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటి నుంచి జరిగిన టెట్ లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడు చెల్లుబాటు అవుతుంది.

టెట్ పరీక్షను 150 మార్పులకు నిర్వహిస్తారో జనరల్ కేటగిరి విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం) బీసీలకు 75 మార్కులు (50 శాతం) ఎస్సీ ఎస్ టి దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) మార్కులు వస్తే అర్హత సాధించినట్లు గా పరిగణిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కుల‌కు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.

Also Read :  RRR , మహర్షిలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే ? ఆ పిల్లాడి బ్యాక్ గ్రౌండ్ ఇదే

Visitors Are Also Reading