పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. జాతీయపార్టీలకు షాక్ ఇస్తూ ఆమ్ ఆద్మీ విజయం పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లో కూడా కొత్త జోష్ ను నింపింది. ఇప్పుడు ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో కేజ్రీవాల్ మాట్లాడుతూ….బీజేపీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.
Advertisement
Advertisement
ఢిల్లీలో కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలను సకాలంలో సక్రమంగా నిర్వహించి అందులో బీజేపీ గెలిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలో తమ పార్టీని చూసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ భయపడుతోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఢిల్లీలో ఈశాన్య, ఉత్తర దక్షిణ కార్పొరేషన్ లను విలీనం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాంతో కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు కురిపించారు.