Home » PAN Aadhaar link: మార్చి 31 డెడ్‌లైన్.. లేకపోతే రూ.10వేలు జరిమానా

PAN Aadhaar link: మార్చి 31 డెడ్‌లైన్.. లేకపోతే రూ.10వేలు జరిమానా

by Anji
Ad

దేశంలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి. అయితే ఇంకా చాలా మంది పాన్ ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటివారు మార్చి 31 లోపు ఆధార్, పాన్ కార్డు ను లింక్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.

Advertisement

Advertisement

కరోనా కారణంగా ఆధార్, పాన్ లింక్ గడువు తేదీని ఈ ఏడాది మార్చి 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పొడిగించింది. అయితే.. ఈ సారి మాత్రం ఇక గడువును పొడిగించేది లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. మార్చి 31 లోపు ఆధార్ పాన్ లింక్ చేసుకోకపోతే రూ 10 వేల జరిమానా విధిస్తామని సీబీడీటీ హెచ్చరించింది. పాన్ ఆధార్ లింకు చేయడం కోసం WWW.incometaxindiaefiling.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి లింక్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ పూర్తి పేరు ఇతర వివరాలు అందించాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లింక్ ఆధార్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం పదిరోజుల్లో ఆధార్ పాన్ కార్డు లింక్ కు పూర్తవుతుంది.

Also Read : స‌న్ రైజ‌ర్స్ త‌గ్గేదేలే.. పుష్ప స్టైల్‌లో ఇర‌గ‌దీసిన ప్లేయ‌ర్లు..!

Visitors Are Also Reading