Telugu News » Blog » స‌న్ రైజ‌ర్స్ త‌గ్గేదేలే.. పుష్ప స్టైల్‌లో ఇర‌గ‌దీసిన ప్లేయ‌ర్లు..!

స‌న్ రైజ‌ర్స్ త‌గ్గేదేలే.. పుష్ప స్టైల్‌లో ఇర‌గ‌దీసిన ప్లేయ‌ర్లు..!

by Anji
Ads

2016 ఐపీఎల్‌ల ట్రోపీని ముద్దాడి 2018లో తుది స‌మ‌రం వ‌ర‌కు వెళ్లిన స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఆ త‌రువాత అంత‌గా ఆక‌ట్టుకోలేదు. మ‌రీ ఈ సీజ‌న్లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టాల‌ని భావిస్తోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ప్రాంచైజీకి చెందిన ఆట‌గాళ్లంతా ప్రాక్టిస్‌తో మునిగితేలుతున్నారు. అయితే ప్రాక్టీస్ గ్యాప్‌లో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లంతా పుష్ప సినిమాలోని త‌గ్గేదేలే డైలాగ్‌ను చెబుతూ అల‌రించారు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో ఫ్రాంచైజీ పోస్ట్ చేసింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌దిత‌ర ఆట‌గాళ్లు త‌గ్గేదేలే అంటూ పుష్ప‌రాజ్‌ను అనుస‌రించారు. వీరిలో ఎవ‌రూ బాగా చేసారో చెప్పాలంటూ నెటిజ‌న్ల‌ను కోరింది సన్ రైజ‌ర్స్‌.

Ads

2013లో లీగ్‌లోకి ఎంట్రి ఇచ్చిన ఈ జ‌ట్టు అప్ప‌టి నుంచి నిల‌క‌డ‌గా రాణిస్తోంది. కానీ గ‌తేడాది డేవిడ్ వార్న‌ర్‌ను కెప్టెన్సీతో స‌హా జ‌ట్టు నుంచి తొల‌గించింది. ఈ ఏడాది మెగా వేలానికి ముందు కేన్ విలియ‌మ్స‌న్‌, అబ్దుల్ స‌మ్మ‌ద్‌, ఉమ్రాన్ మాలిక్‌ల‌ను రిటైన్ చేసుకుంది స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు. భువ‌నేశ్వ‌ర్ కుమార్, న‌ట‌రాజ‌న్‌ను జ‌ట్టు తిరిగి సొంతం చేసుకోగా.. నికోల‌స్ పూర‌న్‌ను జ‌ట్టు భారీ ధ‌ర‌కు ద‌క్కించుకుంది. ర‌షీద్ ఖాన్ ను వ‌దులుకున్న హైదరాబాద్ జ‌ట్టు వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్పిన్న‌ర్ స్థానాన్ని భ‌ర్తీ చేసుకుంది. ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న తొలి మ్యాచ్‌లో భాగంగా మార్చి 29న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌పడ‌నున్న‌ది.

Ad