తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో మధ్యాహ్నం వేళ ప్రజలు బయట అడుగు పెట్టడానికి భయపడి పోతున్నారు. ఏపీలో నంద్యాల, రెంటచింతల ప్రాంతాల్లో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో కూడా 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఓ వైపు ఎండలు.. మరొకవైపు వడగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. మరొక మూడు రోజుల పాటు ఎండలు, వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read : ఇండియా యువతితో మ్యాక్స్‌వెల్ పెళ్లి.. ఆర్సీబీ శుభాకాంక్షలు
Advertisement
Advertisement
ఎండకు తోడు వడగాలుల తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ ఉంటాయని పేర్కొంటున్నారు. తెలంగాణలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నారు. ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారత్ నుంచి తెలంగాణలోకి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంది ఐఎండీ.
ఏపీలోని కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగానే నమోదు అవుతున్నాయి. కానీ పగటి పూట ఉష్ణోగ్రతలో తీవ్రత అధికంగా ఉంటోంది. ఏటా ఏప్రిల్ రెండోవారంలో నమోదు కావడం ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చిలోనే ఎండలు ఇలా ఉండగా.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతూ ఉన్నారు.
Also Read : ప్రపంచకప్‌లో భారత మహిళలకు మరో పరాజయం