Home » ఇండియా యువ‌తితో మ్యాక్స్‌వెల్ పెళ్లి.. ఆర్సీబీ శుభాకాంక్ష‌లు

ఇండియా యువ‌తితో మ్యాక్స్‌వెల్ పెళ్లి.. ఆర్సీబీ శుభాకాంక్ష‌లు

by Anji
Ad

ప్ర‌ముఖ ఆస్ట్రేలియా క్రీడాకారుడు, బిగ్ హిట్ట‌ర్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కీల‌క ఆట‌గాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 15వ సీజ‌న్‌కు ముందు ఓ ఇంటి వాడు అయ్యాడు. త‌న ప్రేయ‌సి, భార‌తీయ యువ‌తి వినీ రామ‌న్‌ను శుక్ర‌వారం పెళ్లాడాడు. అందుకు సంబంధించిన ఫోటోల‌ను ఈ జంట త‌మ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కొంతకాలంగా ప్రేమ‌లో ఉన్న వీరిద్ద‌రూ 2020 ఫిబ్ర‌వ‌రిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న‌ట్టు సామాజిక మాధ్య‌మాల ద్వారా వెల్ల‌డించారు. అప్ప‌టి నుంచి లాక్‌డౌన్‌, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల వివాహాన్ని వాయిదా వేస్తూ వ‌స్తున్న జంట ఎట్ట‌కేల‌కు ఒక్క‌టైంది.

Advertisement

Advertisement

త‌మిళ‌నాడుకు చెందిన వినీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫార్మ‌సిస్ట్‌గా ప‌ని చేస్తున్నారు. ఈ త‌రుణంలోనే వారి మ‌ధ్య పరిచ‌యం ఏర్ప‌డిన త‌రువాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొత్త జంట‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కూడా ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు చెప్పింది. కొద్ది సేప‌టి క్రితం ఆ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్టు చేసింది.

Visitors Are Also Reading