హోలీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ముఖ్యంగా వసంత కాలంలో జరుపుకునే ఈ పండుగ కేవలం భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజు రంగులే కాకుండా వింతగా కొనసాగుతుంది. రంగులతో పాటు అక్కడ దెబ్బలు కూడా తినాలి. ఒకసారి అది ఎక్కడో దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.
Also Read : సమ్మక్క-సారక్క జాతర వివాదంపై చినజీయర్ స్వామి ఏమన్నారంటే..?
Advertisement
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ప్రతి యేటా హోలీ పండుగ రోజు వింత ఆచారం కొనసాగుతుంది. గాంధారి మండలం నేరల్ తండాలో ఏటా హోలీ రోజు రంగులు చల్లుకుంటూ ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పెళ్లి అయిన మహిళలు పెళ్లి కానీ యువతి యువకులను కర్రలతో కొట్టడం సంప్రదాయంగా వస్తోంది.
Advertisement
తండాలోని వారంతా కలిసి రంగులు చల్లుకున్నారు. వాళ్ల సంప్రదాయం ప్రకారం.. మహిళలు పాటలు పాడుకుంటూ వరుస అయిన అందరినీ కర్రలతో కొడుతుంటారు. కొందరూ వాళ్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా తండాలో కోలాహలంగా రంగోలీ జరుపుకున్నారు. చిన్న, పెద్ద అంతా రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలు చేసుకున్నారు. పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ సంతోషంగా హోలీ జరుపుకున్నారు.
Also Read : హోలీ పండుగ రోజు కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..?