కరోనా మహమ్మారీ ప్రపంచ వ్యాప్తంగా తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతోంది. ఇజ్రాయెల్‌లో మరొక కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గూరియోన్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరూ ప్రయాణికులలో కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్ లు బీఏ1, బీఏ2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్టు తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరూ వ్యక్తులు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు వెల్లడించింది.
Also Read : Ghani Trailer : అదరగొడుతున్న ‘గని’ ట్రైలర్
Advertisement
మరొక వైపు భారత్‌కు మళ్లీ కరోనా ముప్పు పొంచి ఉందనే వార్తలు కలవరం సృష్టిస్తూ ఉన్నాయి. ఈ మహమ్మారి కప్రభావం పూర్తిగా తొలగిపోలేదు అని.. మళ్లీ పంజా విసిరే ప్రమాదముందనే హెచ్చరికలు భయాందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ దేశాలను ఆర్థికంగా, ఆరోగ్యంగా తీవ్ర దెబ్బతీసిన కరోనా థర్డ్ వేవ్ త్వరగానే ముగిసింది. ఈ తరుణంలో మరొకసారి రాకాసి వైరస్ బుసకొడుతుందన్న సంకేతాలు హడల్ ఎత్తిస్తున్నాయి.
Advertisement
చైనాలో ఇప్పటికే మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. 2020 మార్చి తరువాత ఇక్కడ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూ ఉన్నాయి. పలు నగరాలలో పాజిటివ్ కేసులు పెరగడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్డౌన్ విధించారు. చైనాలో ప్రతి రోజు 2 నుంచి 3వేల వరకు కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన రెండేండ్లలో చైనాలో రోజువారి కేసుల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. చైనాలో రోజు రోజుకు కేసులు పెరుగుతుండడంతో భారత్‌కు కరోనా ముప్పు తప్పదు అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత్‌లో ఫోర్త్ వేవ్ కచ్చితంగా ఉంటుందనే వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే ఈసారి కరోనా ప్రభావం ఏకంగా 75 శాతం మందిపై పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో కరోనా బీఏ2 వేరియంట్‌తో థర్డ్ వేవ్ వచ్చింది. ఇప్పటికీ ఆ వేరియంట్ ఆనవాళ్లు ఉండడంతో ఫోర్త్వేవ్కు అవకాశం ఉన్నదని కరోనా టాస్క్ గ్రూపును లీడ్ చేస్తున్న డాక్టర్ ఎన్.కే. అరోరా చెప్పారు. ఐఐటీ ఖరగ్‌పూర్ చేసిన పలు అధ్యయనాల్లో భారత్‌లో ఫోర్త్ వేవ్ తప్పదు అని హెచ్చరిక జారీ చేసారు. ముఖ్యంగా జులై నెలలో ఫోర్త్ వేవ్ ప్రభావం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read : ప్రశాంత్ కిషోర్ తో కోలీవుడ్ స్టార్ హీరో భేటీ…పొలిటికల్ ఎంట్రీపై చర్చ..!