ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టీమ్ ఇండియా రెండో పరాజయం చవిచూసింది. న్యూజిలాండ్ తో ఓటమి తర్వాత కరేబియన్ జట్టుపై ఘన విజయం సాధించిన మిథాలీ సేన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ జట్టు పై మాత్రం నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది టీమిండియా. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి ఇండియా కుప్పకూలిపోయింది.
36.2 ఓవర్లలో కేవలం 134 పరుగులకే భారత జట్టు ఆల్ ఔట్ అయ్యింది. అందులో స్మృతి మందాన అత్యధికంగా 35 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. రీచా ఘోష 33 పరుగులు, ఝాలన్ స్వామి 20 పరుగులు చేశారు. ఇక మిగిలిన బ్యాటర్లు అందరూ నిరాశ పరిచారు.
Advertisement
Advertisement
ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ షార్లెట్ డీన్ నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా..అన్యశ్రబ్ శోలే 2, సోపి, కేట్ క్రాస్ ఒక్కొక్క తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీం ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యింది. మేఘన సింగ్ 3, ఝలన్ స్వామి, రాజేశ్వరి, పూజ వస్త్రకర్ తలో వికెట్ తీశారు. హ్యాట్రిక్ ఓటములను చవిచూసిన ఇంగ్లాండ్ జట్టు తొలి విజయం సాధించింది. ఈ సమయంలో భారత్ 4 మ్యాచ్ లో రెండు ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ టీమిండియా ఓడిపోయింది.
Also Read : జబర్దస్త్ వర్ష గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…ఇదివరకు ఏం జాబ్ చేసిందంటే..!