ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో ఓటమి పై కాంగ్రెస్ అధిష్టానం పలు సంచలన నిర్నయాలు తీసుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఓటమి పై ఎన్కౌంటర్ పేరుతో పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగంతో సోనియాగాంధీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో సోనియా గాంధీ ఎన్నికలో ఓడిపోయిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఐదు రాష్ట్రాల శాఖలను పునర్ నిర్మించడానికి ఆ రాష్ట్రాల పీసీసీ ఛీఫ్ లు రాజీనామా చేయాలని సోనియా గాంధీ ఆదేశించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ మంగళవారం ప్రకటన కూడా విడుదల చేశారు.