బాహుబలి విజయంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. టాలీవుడ్ తో పాటూ ఇతర ఇండస్ట్రీలలోనూ అభిమానులను సంపాదించుకున్నారు. దాంతో ప్రభాస్ సినిమాకు కూడా కలెక్షన్స్ పెరిగిపోయాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించిన నాలుగు భారీ బడ్జెట్ చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
బాహుబలి పార్ట్ 1 ప్రభాన్ ను పాన్ ఇండియాకు పరిచయం చేసిన సినిమా ఇదే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలో 165 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.
Advertisement
బాహుబలి సినిమాకు వచ్చిన క్రేజ్ తో బాహుబలి పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్గుగా సినిమా ఉండటంతో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం ఏకంగా 545 కోట్ల కలెక్షన్స్ రాగా సెన్సేషనల్ రికార్డు నమోదైంది.
ఈ సినిమా తరవాత యంగ్ డైరెక్టర్ సుజిత్ ప్రభాస్ తో సాహో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది కానీ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రానికి మొదటివారంలో 294 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంతో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల నడుమ మార్చి 11న విడుదలైంది. ఈ చిత్రానికి మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 151 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.