Home » AP Assembly : ఐదుగురు ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌..!

AP Assembly : ఐదుగురు ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌..!

by Anji
Ad

ఏపీ అసెంబ్లీలో సోమ‌వారం గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. ప‌శ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సారా మ‌ర‌ణాల‌పై టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాఉల జ‌ర‌గ‌కుండా అడ్డుకున్నారు. అనంత‌రం స్పీక‌ర్ పొడియం చుట్టి ముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీక‌ర్ త‌మ్మినేని కీల‌క ననిర్ణ‌యం తీసుకున్నాడు.

Advertisement

అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసారు. అచ్చెన్నాయుడు, ప‌య్యావుల కేశ‌వ్‌, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, నిమ్మ‌ల రామానాయుడు, బాల వీరాంజ‌నేయులును మార్ష‌ల్‌ను ఆదేశించారు. మార్చి 22 వ‌ర‌కు మ‌ళ్లీ స‌స్పెండ్ అయిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు స‌భ‌లోకి అడుగుపెట్ట‌లేదు

Advertisement

ఈ స‌స్పెన్ష‌న్‌పై శాస‌న స‌భ వ్య‌వ‌హారాల మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌గా.. మిగ‌తా వైసీపీ స‌భ్యులు మ‌ద్ద‌తు తెలిపారు. స‌స్పెండ్ అయిన త‌రువాత కూడా ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు స‌భ నుంచి బ‌య‌టకు వెళ్ల‌లేదు. అక్క‌డే త‌మ నిర‌స‌న‌ను కొన‌సాగించారు. జంగారెడ్డి గూడెం మ‌ర‌ణాల‌పై చేప‌ట్టాల‌ని నినాదాలు చేశారు.

Also Read : మెగాస్టార్ సినిమా కోసం రవితేజకు భారీ రెమ్యునరేషన్…ఎంతంటే…!

Visitors Are Also Reading