Home » వైసీపీ పాల‌న‌పై న‌మ్మ‌కం పోయిందంటున్న పురంధేశ్వ‌రి

వైసీపీ పాల‌న‌పై న‌మ్మ‌కం పోయిందంటున్న పురంధేశ్వ‌రి

by Anji
Ad

ఇవాళ శ‌క్తి కేంద్ర ప్ర‌ముఖుల స‌మావేశం జ‌రిగింది. ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పురంధేశ్వ‌రి హాజ‌ర‌య్యారు. నాలుగు రాష్ట్రాల‌లో బీజేపీ విజ‌యం, ఏపీలో పార్టీ ప‌రిస్థితుల‌పై చ‌ర్చ జ‌రిగింది. యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం కార్య‌క‌ర్త‌ల స‌మిష్టి కృషి అన్నారు. విశ్వ‌సించే బీజేపీ ఒక్క‌టే అని నాలుగు రాష్ట్రాల్లో విజ‌యం స్పూర్తితో ఇక్క‌డ కేడ‌ర్, లీడ‌ర్లు విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని పిలుపునిచ్చారు.

ఏపీలో ప్ర‌భుత్వం వికాశం వైపు కాకుండా వ్య‌క్తి గ‌త స్వ‌లాభం ప్ర‌ధానంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఏపీ రాష్ట్రంలో అధికార పార్టీపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం స‌న్నగిల్లింద‌ని ఫైర్ అయ్యారు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పురంధేశ్వ‌రి. ఏపీ ప్ర‌భుత్వం అప్పుపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేద‌ని చెప్పారు. అధ్వాన్న స్థితిలో ఏపీ రాష్ట్రం ఉంద‌న్నారు. అందించాల్సిన స్థాయిలో కేంద్రం రాష్ట్రానికి నిధులు అందించ‌డం లేద‌న్న అప‌వాదు వింటున్నామ‌ని ప్ర‌క‌ట‌న చేసారు.

Advertisement

Advertisement

కేంద్రం నిధులు ఆపేస్తే ఏపీలో అభివృద్ధి సాధ్య‌మా..? అని ఆగ్ర‌హించారు. రాష్ట్రంలోని అభివృద్ధి ప‌నుల్లో కేంద్రం ఇచ్చే నిధులు త‌ప్ప రాష్ట్ర వాటా సున్నా అని విమ‌ర్శ‌లు చేశారు. గుప్పెడు మ‌ట్టి కూడా రోడ్డుపై వేసే ప‌రిస్థితి లేదు అని చెప్పారు. కేంద్రం ఇచ్చిన 70వేల కోట్ల నిధుల‌ను డైవ‌ర్ట్ చేశార‌ని ఫైర్ అయ్యారు. ఏపీలో చాలా మార్పులు రావాల‌ని పేర్కొన్నారు.

Also Read :  దానివ‌ల్ల ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో అసంత్రుప్తి..కృష్ణం రాజు షాకింగ్ కామెంట్స్..!

Visitors Are Also Reading