సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తరువాత యూత్ ఏదో విధంగా తాము పాపులర్ అవ్వాలని ఏవేవో చేస్తున్నారు. అవన్నీ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా బాగా పాపులర్ అయింది. తమ క్రియేటివిటికి పదును పెట్టి పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వధూవరులు తమకు నచ్చిన విధంగా ఫోటో షూట్ చేస్తుంటారు.
తాజాగా ఓ జంట పెళ్లి ముందే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌ను డిఫరెంట్‌గా చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వధూవరులు ఒక గుడికి వెళ్లారు. అక్కడ వధూవరులిద్దరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు. వారికి తోడుగా మరికొందరూ వ్యక్తులు కూడా ఉన్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే.. పెళ్లి కొడుకు తల క్రిందులుగా అంటే కాళ్లు పైకెత్తి తన చేతులపైన నిలుచొని ఉన్నాడు.
Advertisement
Advertisement
Also Read : కెనడాలో ఆర్ఆర్ఆర్ క్రేజ్…వీడియో వైరల్….!
పక్కనే వధువు తకిట తథిమి.. తకిట తథిమి అంటూ డ్యాన్స్ చేస్తుంది. తమ స్నేహితులందరూ ఇది ఫోటో షూట్ చేస్తున్నారు. మధ్యలో వాళ్లు కూడా వీళ్లకు జత కలిసి డ్యాన్స్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వామ్మో నేను బతికి పోయాను.. నాకు ముందే పెళ్లి అయింది. లేకపోతే ఏమి జరిగేదో అంటూ.. పెళ్లికి ముందే ఈ అమ్మాయి తలక్రిందులుగా నిలబెట్టింది. ఆ తరువాత ఇంకా ఏమి చేస్తుందో అంటూ ఫన్ని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇక ఆ ఫన్నీని మీరు కూడా చూసేయండి.