పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు థియేటర్ లలో విడుదలైంది. కాగా ఈ సినిమా చాలా మందిని నిరాశపరించింది.
సినిమా చాలా స్లోగా ఉందని మాస్ సీన్లు లేవని ప్రేక్షకులు నిరాశచెందుతున్నారు. అయితే ఈ సినిమా పిరియాడికల్ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా పామిస్ట్రీ నేపథ్యంలో సినిమా కథ సాగుతుంది.
దాంతో సినిమాలో ఫ్యాన్స్ ఆశించిన మేర మాస్ సీన్లను చిత్రించలేదు. ఇక రాథేశ్యామ్ పై ట్రోల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. దాంతో ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను ఇచ్చిన తమన్ సినిమా పై వస్తున్న ట్రోల్స్ కు కౌంటర్ ఇచ్చారు. సినిమా స్లోగా ఉందంట…నువ్వు పరిగెత్తాల్సింది అంటూ తమన్ ట్రోలర్స్ పై సెటైర్ వేశారు. ఇక ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ పై వచ్చిన ట్రోల్స్ పై కూడా తమన్ ఇదేవిధంగా స్పందించిన సంగతి తెలిసిందే.