తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచుకునేలా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దాంతో తెలంగాణ ప్రభుత్వం పై పలువురు ప్రశంసలు కురిపించారు. ఇక రీసెంట్ గా ఏపీ సర్కార్ కూడా సినిమా టికెట్ల ధరలపై నియంత్రణలు ఎత్తివేసింది. అంతే కాకుండా చిత్రపరిశ్రమకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
దాంతో ఏపీ ప్రభుత్వం పై కూడా సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ఏపీ తెలంగాణ సర్కార్ లపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ కొత్త జీవోను విడుదల చేసి చిత్రపరిశ్రమకు సాయం చేసినందుకు సీఎం జగన్, మంత్రి పేర్నినాని గార్లకు కృతజ్ఞతలు. సినిమా పరిశ్రమ పునరుద్దరణకు ఈ జీవో తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ఇక మరో ట్వీట్ లో రాజమౌళి తెలంగాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. థియేటర్లలో విడుదలవుతున్న పెద్ద సినిమాలకు ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. అలాగే మాకు సహాయపడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా థాంక్స్ ఈ సాయం సినిమా రంగానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటూ జక్కన్న ట్వీట్ లో పేర్కొన్నారు.