Home » స‌చిన్ రికార్డు బ్రేకు చేసి సెలక్ట‌ర్ల దృష్టిలో ప‌డ్డాడు.. త్వ‌ర‌లో టీమిండియాలో చోటు..!

స‌చిన్ రికార్డు బ్రేకు చేసి సెలక్ట‌ర్ల దృష్టిలో ప‌డ్డాడు.. త్వ‌ర‌లో టీమిండియాలో చోటు..!

by Anji
Ad

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ప్ర‌స్తుతం క్రికెట్‌లో దూసుకుపోతున్నాడు. రంజీ ట్రోఫీ కొత్త సీజ‌న్‌లో అత‌ని బ్యాట్ చెల‌రేగుతుంది. సెంచ‌రీల మీద సెంచ‌రీలు చేస్తున్నాడు. దీంతో ముంబై జ‌ట్టు క్వార్ట‌ర్స్ ఫైన‌ల్‌కు చేరుకున్న‌ది. ఈ ఫామ్ ఇలాగే కొన‌సాగితే ముంబై టైటిల్‌ను గెలుచుకోవ‌డం ఖాయం. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 3 మ్యాచ్ ల్లో 4 ఇన్నింగ్స్ లో 137.75 స‌గ‌టుతో 526 ప‌రుగులు చేసాడు. రెండు సెంచ‌రీలు, 1 అర్థ సెంచ‌రీ సాధించాడు. అత్య‌ధిక స్కోరు 275 ప‌రుగులు. ఇది సౌరాష్ట్రంపై సాధించాడు. త‌రువాత‌ర ఒడిశాపై 165 ప‌రుగుల‌తో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read :  మోడీ-పుతిన్ 50 నిమిషాలు ఫోన్ సంభాష‌ణ.. దేని గురించి అంటే..?

Advertisement

టోర్న‌మెంట్ లో అతని అత్య‌ల్ప స్కోరు 48 ప‌రుగులు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రంజీ ట్రోపీ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండ‌వ ఆట‌గాడు స‌ర్ప‌రాజ్ ఖాన్ మాత్ర‌మే. అయితే స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అంత సులువుగా క్రికెట‌ర్ కాలేదు. ఆయ‌న‌ను ఈ స్థాయికి తీసుకురావ‌డానికి అత‌ని తండ్రి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ప్ర‌తిరోజు ఇంటి నుండి ఆజాద్ మైదాన్‌కు ప్రాక్టీస్ కోసం తీసుకెళ్లేవాడు. 24 ఏళ్ల స‌ర్ఫ‌రాజ్ 1997 అక్టోబ‌ర్ 22 న జ‌న్మించాడు. త‌న తండ్రి వ‌ద్ద‌నే తొలుత క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. క్రికెట్ క‌మిట్‌మెంట్ కార‌ణంగా అత‌ను పాఠ‌శాల‌కు వెళ్ల‌లేక‌పోయిన‌ప్పుడు తండ్రి ప్రైవేటు ట్యూట‌ర్‌ను ఏర్పాటు చేశాడు.

Advertisement

ముఖ్యంగా 2009లో కేవ‌లం 12 ఏళ్ల వ‌య‌స్సులో హారిస్ షీల్ట్ గేమ్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ నెల‌కొల్పిన 45 ఏళ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డంతో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తొలిసారిగా వెలుగులోకి వ‌చ్చాడు. 421 బంతుల్లో 439 ప‌రుగులు చేసాడు. మొత్తం 68 బౌండ‌రీలున్నాయి. ఇందులో 56 ఫోర్లు, 12 సిక్స‌ర్లున్నాయి. త్వ‌ర‌లో అత‌ను ముంబై అండ‌ర్ 19 జ‌ట్టులో ఆ త‌రువాత ఇండియా అండ‌ర్ -19 చోటు సంపాదించాడు. స‌ర్ప‌రాజ్ స్వ‌స్థ‌లం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అజంఘ‌డ్ అత‌ను ముంబై త‌రుపున దేశ‌వాళి క్రికెట్ ఆడ‌తాడు. అత‌ని రంజీ ఆరంగేట్రం 2014 లో బెంగాల్‌పై జ‌రిగింది. అప్ప‌టి నుంచి 22 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 77.74 స‌గ‌టుతో 2099 ప‌రుగులు చేశాడు. ఈ స‌మ‌యంలో అత‌ను 6 సెంచ‌రీలు, 6 అర్థ‌సెంచ‌రీలు చేశాడు. ఇందులో 301 ప‌రుగులు అత‌ని అత్య‌ధిక స్కోరు.

Also Read :  Video Viral : పుష్ప స్టైల్‌లో త‌గ్గేదేలే అంటున్న విరాట్ కోహ్లీ..!

Visitors Are Also Reading