తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సభలో ప్రవేశపెట్టారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన తక్కువ కాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదిద్దాల్చిందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎండగట్టారు.
Advertisement
గతంలో సాగునీరు తాగునీరు, ఆకలి చావులు కరెంట్ కోతలు ఇలా ఎన్నో సమస్యల విలయంలో రాష్ట్రం కొట్టుమిట్టాడిందని.. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్లినట్టు చెప్పారు. ఇంకా వివక్ష కొనసాగుతుందని.. కేంద్రం వైఖరి కాళ్లలో కట్టెలు పెట్టే విధంగా ఉందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకోకముందే ఖమ్మంలోని ఏడు మండలాలను ఏపీకీ కట్టబెట్టిందన్నారు. ఐదేళ్ల పాటు హైకోర్టు విభజన చేయకుండా తాత్పారం చేసిందన్నారు.
విభజన చట్టంలోని పేర్కొన్న హామీలను ఇంకా అమలు చేయడం లేదన్నారు. జిల్లాలకు నిధులు, కేటాయింపు విషయంలో ఆలస్యం చేస్తూ వస్తోందని.. రాష్ట్రాల అధికారాలను కబలిస్తోందని మండిపడ్డారు. కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు విమర్శిస్తున్న భారతీయ పార్టీ సభ్యులు అడ్డు తగిలారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ఈటల రాజేందర్ రాజాసింగ్, రఘునందన్ రావులను సస్పెండ్ఖ సభ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్ చేసారు. శాసన సభ సమావేశాలు ముగిసే వరకు ఈ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
Advertisement
రూ.2.5 లక్షల కోట్లతో బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ.1.89లక్షల కోట్లు,
క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు
దళిత బంధు 17,700 కోట్లు.
పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు
కొత్త వైద్య కళాశాలకు రూ.1000 కోట్లు
అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు
కొత్త వైద్య కళాశాలకు రూ.1000 కోట్లు
అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
రూ.50 వేలలోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
వచ్చే ఆర్థిక ఏడాది రూ.75వేల లోపు సాగు రుణాలు మాఫీ
నీటి పారుదల రంగానికి రూ.22,675 కోట్లు
ఆసరా పింఛన్ల పథకానికి రూ.11,728 కోట్లు
కల్యాణలక్ష్మి, షాది ముబారక్ రూ.2,750 కోట్లు
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ. 12వేల కోట్లు
రోడ్ల భవనాల కోసం రూ.1,542 కోట్లు
ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు
బ్రాహ్మనుల సంక్షేమమం కోసం రూ.177 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ.5,698 కోట్లు
ఎస్టీల సంక్షేమం కోసం రూ.12,565 కోట్లు
మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగులో వైద్య కళాశాలలు, నారాయణపేట, గద్వాల యాదాద్రి వైద్య కళాశాలలు అదేవిధంగా రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడడం లేదు. పనుల కోసం ఇతర ప్రాంతాల వారు తెలంగాణకు వస్తున్నారు. వ్యవసాయం అనుబంధ వ్యాపార రంగాలు ముందుకెళ్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది. గ్రామీణ జీవితం ఎంతో మారిపోయింది.
Also Read : దర్శకుడిగా తిరుగులేని రాజమౌళి నటించిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్…!