దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుపోయింది. ఎక్కడ చూసినా గంటకు ఒక్కటైనా ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలంగాణలో దిశ ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటన తరువాత తెలుగు రాష్ట్రాలలో మహిళా రక్షణ చర్యలు వేగవంతమయ్యాయి.
Advertisement
తెలంగాణ రాష్ట్రం మరొక రక్షణ చర్యను ముందుకు తీసుకొచ్చింది. యువతులు, మహిళల భద్రత కోసం రాష్ట్ర మహిళా కమిషన్ మరొక కొత్త వాట్సాప్ నెంబర్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆపద ఎదురైందన్న సమయంలో మహిళలు, యువతులు ఈ వాట్సాప్ నెంబర్కు ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు వెంటనే ఇన్పర్మేషన్ పాస్ అవుతుంది. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి భద్రత కల్పించి అండగా నిలబడతారు. ఈ నెంబర్ ను అందరూ మహిళలు, యువతులకు తెలిసే విధంగా కళాశాల, పాఠశాల ఇలా ప్రతి చోటా గోడలపై రాయించబోతున్నట్టు మహిళా కమిషన్ ప్రతినిధులు వెల్లడించారు.
Advertisement
మహిళలకు భద్రత పెంచడంతో ఎవరైనా మహిళలు, యువతుల విషయంలో చిన్న తప్పు చేయడానికి సైతం ఆలోచించకుండా ఉండేవిధంగా చేయాలన్నే వారి ధ్యేయం. ఈ నూతన వాట్సాప్ నెంబర్ను ప్రతి మహిళా ముందు జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం మంచిదని మహిళా కమిషన్ ప్రతినిధులు తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం 9490555533 ఈ నెంబర్ను నోట్ చేసుకోండి.
Also Read : IND Vs SL : మొహలీలో లంకపై భారత్ ఘన విజయం