Home » IND Vs SL : మొహ‌లీలో లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

IND Vs SL : మొహ‌లీలో లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

by Anji
Ad

మొహ‌లీ వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. 174 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన లంక ఫాలో ఆన్‌లో కూడా చ‌తికిల‌ప‌డింది. ఫాలో ఆన్ బ్యాటింగ్‌కు దిగిన శ్రీ‌లంక టీమ్ 178 ప‌రుగులు చేసి కుప్ప‌కూలింది. ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా 4 వికెట్లు తీసి లంక‌ను ఆలౌట్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ 4 వికెట్లు, మ‌హ్మ‌ద్ ష‌మీ 2 వికెట్లు తీశాడు. మూడ‌వ రోజు ఆట‌లో భాగంగా తొలి సెష‌న్‌లో భార‌త బౌల‌ర్లు అద‌ర‌గొట్టారు. జ‌డేజా ఐదు వికెట్లు తీశాడు.

Advertisement

నిస్సంక (61) ఒక్క‌డే అర్థ శ‌త‌కంతో రాణించాడు. మిగ‌తా బ్యాట‌ర్లంతా పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. నిన్న‌టి ఇన్నింగ్స్‌కు మ‌రొక 66 ప‌రుగులు ప‌రుగులు జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. తొలుత జ‌ట్టు స్కోరు 161 ప‌రుగుల వ‌ద్ద అస‌లంక‌ను ఎల్బీడ‌బ్ల్యూగా వెన‌క్కి పంప‌డంతో లంక స‌గం వికెట్లు కోల్పోయింది. భార‌త బౌల‌ర్లు చెల‌రేగి 13 ప‌రుగుల తేడాతోనే మిగిలిన ఐదు వికెట్ల‌ను ప‌డ‌గొట్టారు. ఈ త‌రుణంలో జ‌డేజా ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించాడు.

Advertisement

దీంతో భార‌త్ 400 ప‌రుగుల ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. టెస్ట్ క్రికెట్‌లో ఆల్‌టై్‌మ్ లీడింగ్ టేక‌ర్స్ జాబితా టాప్ టెన్‌లోకి భార‌త బౌల‌ర్ అశ్విన్ ప్ర‌వేశించాడు. రంగానా హెరాత్ (శ్రీ‌లంక‌తో 433) క‌లిసి 10వ స్థానంలో నిలిచాడు. అశ్విన్ త‌న టెస్ట్ కెరీర్‌లో అత్య‌ధికంగా బెన్‌స్టోక్స్‌ను 11 సార్లు ఔట్ చేశాడు. డేవిడ్ వార్న‌ర్‌ను 10 సారు, అలిస్ట‌ర్ కుక్‌ను 9 సార్లు టామ్ లాథ‌మ్ 8 సార్లు ఎడ్ కొవాన్‌, అండ‌ర్స‌న్, తిరిమాన్నేల‌ను త‌లో 7 సార్లు పెవిలియ‌న్‌కు పంపాడు.

తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ రెండు వికెట్లు తీయ‌గా.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జ‌డేజా కూవ‌సం చేసుకున్నాడు. ఈ విజ‌యంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యం సంపాదించింది. విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్ట్ కావ‌డం విశేషం. మొత్తానికి 100వ టెస్ట్‌లో సెంచ‌రీ చేయ‌క‌పోయినా కోహ్లీ భారీ విజ‌యంతో ఈ మ్యాచ్‌ను చిర‌స్మ‌ర‌ణీయంగా మార్చుకున్నారు.

Also Read :  IPL 2022 : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. షెడ్యూల్ వ‌చ్చేసింది..!

Visitors Are Also Reading