Ad
2021 T20 వరల్డ్ కప్ లో…. పాకిస్తాన్ తో మ్యాచ్ లో కోహ్లీ టాస్ ఓడిపోయాడు, తర్వాతి న్యూజిల్యాండ్ మ్యాచ్ లో కూడా టాస్ ఓడిపోయాడు…చివరకు ఆప్ఘాన్ మ్యాచ్ లో కూడా టాస్ ఓడిపోయాడు. మొదటి రెండు మ్యాచుల్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయడం టీమ్ ఇండియాకు పెద్ద మైనస్ అయ్యింది.
Advertisement
Advertisement
T20 వరల్డ్ కప్ లో టాస్ ఓడిపోవడం కోహ్లీకి ఇది వరుసగా 6వ సారి. చివరి 9 T20 మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా కేవలం ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచింది. అప్పుడు కెప్టెన్ గా ధావన్ ఉన్నాడు. ఇక కోహ్లీ గురించి చూసుకుంటే చివరి 14 మ్యాచుల్లో కోహ్లీ 13 సార్లు టాస్ ఓడిపోయాడు. 20 మ్యాచుల్లో 17 సార్లు టాస్ ఓడిపోయాడు. 2020 నుండి ఇప్పటి వరకు కోహ్లీ కెప్టెన్సీ చేసిన 41 మ్యాచుల్లో 31 సార్లు టాస్ ఓడిపోయాడు.
టాస్ విషయంలో కోహ్లీది నిజంగా బ్యాడ్ లక్ యే!