కాలుష్యాన్ని నివారించడానికి చమురు ధరల నుండి విముక్తికోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వాలు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వాలు భారీగా రాయితీలను ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పూణేలో ప్రధాని నరేంద్రమోడీ వంద ఎలక్ట్రిక్ బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అంతే కాకుండా పూణేలో ఈ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ లను కూడా ఏర్పాటు చేశారు. ఇక తాజాగా ప్రారభించిన వంద బస్సులతో పూణేలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య మొత్తం 250కి చేరింది.
Advertisement
Advertisement
ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఇండియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే ఒలెక్ట్రా తయారు చేసింది. ఒలెక్ట్రా పూణేతో పాటూ సూరత్, ముంబై, గోవా, నాగ్ పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్ లలో కూడా ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. ఇక ఈ బస్సులతో శబ్ద కాలుష్యం తగ్గటంతో పాటూ వాయు కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు తిరుపతిలోనూ భక్తులను కొండపైకి తీసుకెళ్లేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.