మహిళలనుద్దేశించి తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. స్త్రీలకు సహనం, ఓపిక ఎక్కువే అంటూ ఆయన వెల్లడించారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా మహిళా బంధు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్త్రీలకు సహనం, ఓపిక ఎక్కువేనని, కేసీఆర్ మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు.
Also Read : Russia Ukraine War : రష్యాతో పోరాడేందుకు ముందుకొచ్చిన అమెరికన్లు..!
Advertisement
Advertisement
దేశంలో ఎక్కడ లేని విధంగా పంచాయతీ, మున్సిపల్‌లలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కిందని పేర్కొన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని.. ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లను ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఆశావర్కర్లకు జీతాలు పెంచామని, దేశంలో క్లీన్ సిటీ హైదరాబాద్ అన్నారు. మహిళా దినోత్సవమంటే కేవలం ఒక్కరోజే కాదు.. అన్ని రోజులు మహిళలవేనని పేర్కొన్నారు మహమూద్ అలీ.
Also Read : Jr. NTR & మంచు మనోజ్ ల మధ్య 5 పోలికలు.