బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉంది. రీసెంట్ గా సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఊ అంటావా పాట నెట్టింట వైరల్ అవడంతో ఎంతో మంది ఈ పాటకు ఫిదా అయ్యారు. సమంత విడాకుల తరవాత వచ్చిన మొదటి సినిమా పుష్ప కావడంతో ఈ సినిమాకు సమంత కూడా ఎంతో పాపులారిటీ తీసుకువచ్చింది.
ALSO READ : పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ను తిట్టడం ఎంతవరకు కరెక్ట్..?
Advertisement
ఇక ప్రస్తుతం సమంత శాకుంతలం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే సమంత లుక్ ను రివీల్ చేయగా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే సమంత ఎక్కువగా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.
Advertisement
తన సినిమాలకు సంబంధించిన అంశాలు ఇతర విషయాలను సమంత అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కాగా తాజాగా సమంత చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. సమంత తన పెట్స్ జిమ్ లో ఫైట్ చేసుకుంటున్న వీడియోను షేర్ చేసింది. సాషా, హష్ అనే పెట్స్ సమంత వద్ద ఉండగా అవి రెండూ ఫైట్ చేసుకుంటున్నాయి.
ఇక గతంలో అవి రెండు చాలా దూరంగా ఉండేవని పేర్కొంది. కానీ ఆ తరవాత రెండింటి మధ్య స్నేహం ఏర్పడిందని సమంత పేర్కొంది. ఇక ఇప్పుడూ రెండూ కొట్టుకుంటున్నాయని జీవితంలో తాను ఊహించినట్టుగానే జరిగిందని సమంత పేర్కొంది. అయితే ఈ పోస్ట్ ను సమంత నాగచైతన్యను ఉద్దేశించే చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.