ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఏపీ సీఎంతో జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారం కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపారు.
Advertisement
పోలవరం ఏపీకి జీవనాడి అని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను, సవాళ్లను పరిశీలించానని, పనుల పురోగతిలో అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ పోలవడం అథారిటీ, సీడబ్ల్యూసీకి ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వివరించారు. తొలుత దేవీపట్నం మండలం ఇందుకూరు నిర్వాసితుల కాలనీని కాలనీని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ పరిశీలించారు. పోలవరం నిర్వాసితుల కోసం ఇక్కడ 350 ఇండ్లను నిర్మించారు.
Advertisement
ఇందుకూరులో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పునరావాస కాలనీ అద్భుతంగా ఉందన్నారు. పునరావాస బాధిత కుటుంబాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర అధికారులు, పీపీఏ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ముఖ్యంగా తాను రెండేండ్ల ముందే ఇక్కడికి రావాల్సి ఉందని.. వచ్చి ఉంటే ప్రాజెక్టు పనులు ఇంకా వేగంగా జరిగి ఉండేవన్నారు. కరోనా కారణంగా రాలేకపోయానని చెప్పారు.
Also Read : PSPK 10 రిమేక్ సినిమాలు. 9 హిట్లు,1 ఫట్! ఇదిగో ఆ లిస్ట్!!