ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆ దేశం విడిచి వెళ్లిపోయారు. పోలాండ్‌లో తలదాచుకున్నారని రష్యా మీడియా పేర్కొనడం ఇప్పుడు చర్చగా మారింది. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జెలెన్ స్కీ ఉక్రెయిన్ లోనే ఉన్నారని కానీ.. దేశం వీడారని కానీ.. ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఉక్రెయిన్. ఇలాంటి ఆరోపణలు రష్యా మీడియా కొన్ని రోజుల క్రితం చేసిన విషయాన్ని గమనించాల్సి ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దేశంలో లేరని, దేశాన్ని విడిచి పారిపోయారంటూ గతంలోనూ పేర్కొన్నది రష్యన్ మీడియా.
Also Read : ఆ బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన పొలార్డ్.. అలా బ్యాటింగ్ చేస్తావా..?
Advertisement
Advertisement
అప్పుడు కౌంటర్ ఇచ్చిన జెలెన్ స్కీ.. ఆ దేశ రాజధాని వీధుల్లోనే ప్రత్యక్షమైన కౌంటర్ ఇచ్చారు. తాజా కథనాలపై ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యా దాడులు తీవ్రతరం చేసిన ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కీ తగ్గకుండా ఎదురుదాడికి దిగుతోంది. యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టమే దీనికి ఉదాహరణ.
ఇక రష్యా ఓ వైపు దాడులు చేస్తున్నా.. మరొకవైపు దేశాన్ని వీడేది లేదు. ఇక్కడే ఉంటాం. దేశాన్ని కాపాడుకుంటాం. మాకు ఆయుధాలు కావాలంటూ ఎప్పటికప్పుడూ ప్రకటనలు చేస్తూ.. ఉక్రెయిన్లలో ధైర్యాన్ని నింపుతూ వస్తున్నారు ఆదేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ. అయితే జెలెన్ స్కీ పై రష్యా మీడియా తాజాగా ప్రసారం చేసిన ఓ కథనం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆ దేశంలో లేరని.. ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు పారిపోయారు అనేది వాటి సారాంశం.
Also Read : Shane Warne: క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ కన్నుమూత