క్రికెట్ ప్రపంచంలో పెను విషాదమే నెలకొన్నది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ, స్పిన్నర్ షేన్ వార్న్ (52) అకస్మాత్తుగా మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్టు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. తొలుత తన నివాసంలో వార్న్ విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement
అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. వార్న్ గుండెపోటుకు గురైనట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. షేన్ వార్న్ ఆస్ట్రేలియా విజయాలలో కీలక పాత్ర పోషించాడు. 145 టెస్ట్‌లలో 708 వికెట్లు తీశాడు. 194 వన్డేలలో 293 వికెట్లు తీసాడు. టెస్ట్‌లో 5 వికెట్లు 37 సార్లు, 10 వికెట్లు పది సార్లు తీసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో నాలుగేళ్ల పాటు రాజస్థాన్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 57 వికెట్లు సాధించాడు వార్న్.
Also Read : ఆ బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన పొలార్డ్.. అలా బ్యాటింగ్ చేస్తావా..?