Home » మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్‌లో అన్ని మ్యాచ్‌ల‌కు డీఆర్ఎస్ విధానం

మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్‌లో అన్ని మ్యాచ్‌ల‌కు డీఆర్ఎస్ విధానం

by Anji
Ad

మార్చి 04 నుంచి ప్రారంభం అయ్యే మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌న‌కు న్యూజిలాండ్ స‌ర్వం సిద్ధ‌మైంది. ఏప్రిల్ 03వ తేదీ వ‌ర‌కు జ‌రిగే ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో భార‌త్ స‌హా మొత్తం ఎనిమిది జ‌ట్లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి. ఈ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో డీఆర్ఎస్‌ ప‌ద్ద‌తిని వినియోగిస్తున్న‌ట్టు ఐసీసీ ప్ర‌క‌టించింది.

Advertisement

Advertisement

తొలిసారిగా 2017 మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్‌లో డీఆర్ఎస్‌కు ఐసీసీ ప్ర‌వేశ‌పెట్టింది. ఈసారి మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ పోటీల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ఉంటుంది. ఐసీసీ టీవీ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్్నవారంద‌రూ లైవ్ ఇస్తారు. ఆరు మైదానాల్లో క‌నీసం 24 కెమెరాల‌తో మ్యాచ్‌ల‌ను ప్రేక్ష‌కుల కోసం ప్ర‌సారం చేస్తాం. అలాగే ఈ ఈసారి డీఆర్ఎస్ ని వినియోగిస్తున్నాం అని ఐసీసీ వెల్ల‌డించింది. టీమిండియా తొలి మ్యాచ్‌లో మార్చి 06న పాకిస్తాన్‌లో త‌ల‌ప‌డ‌నుంది.

Also Read :  క‌థ, స్క్రీన్ ప్లే అంతా సీఎం ఆఫీస్ నుంచే జ‌రిగింది : బండి సంజ‌య్

Visitors Are Also Reading