ఈ రోజుల్లో తప్పు చేయడం సర్వ సాధారణం అయిపోయింది. తెలిసి తెలియక ఒక తప్పు చేస్తుంటారు. ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. కొంతమంది అయితే ఎంతటికీ అయినా సిద్ధపడతారు. అలాంటి ఘటనలు కొన్ని వింటే విచిత్రం అనిపిస్తుంటుంది. లండన్‌కు చెందిన ఓ మహిళ ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి ఏకంగా తాను చనిపోయినట్టుగా అందరినీ నమ్మించింది. కొన్నాళ్ల పాటు పోలీసులు కూడా అది నిజమే అనుకున్నారు. కానీ ఇన్నాళ్లకు వాస్తవం వెలుగులోకి వచ్చింది.
Also Read : ఉక్రెయిన్‌లోని నగరాల స్వాధీనం కోసం రష్యా యత్నం.. తిరగబడుతున్న యువత..!
Advertisement
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. లండన్ు చెందిన జో బెర్నాడ్ అనే మహిళకు సరిగ్గా డ్రైవింగ్ రాదు. 2019లో మొదటిసారి జో డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పోలీసులకు చిక్కింది. అప్పులు పోలీసులు ఆమెను మందలించడంతో పాటు సంవత్సరం పాటు డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పారు. కానీ జో వినలేదు. 2020లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తుందని జోను పోలీసులు ఆపే ప్రయత్నం చేసారు. కానీ అప్పుడు కారు ఆపడం ఆమెకు రాలేదు. ఆ సమయంలో తన పేరు కైషా బెర్నాడ్ అని చెప్పింది జో.
కారు ఆపలేకపోయిన కారణంగా తనకు డ్రైవింగ్ రాకపోయినా రోడ్డుపై డ్రైవ్ చేస్తోందని పోలీసులు జోపై కేసు నమోదు చేశారు. ఆ కేసు గురించి కనుక్కోవడానికి ఓసారి పోలీసులు జో ఇంటికి ఫోన్ చేయగా.. జో ఆరోగ్యం బాలేదని.. తాను జో చెల్లిలు అని వారిని నమ్మించింది. మెల్లగా అనారోగ్యం వల్ల జో చనిపోయిందని అబద్దం చెప్పింది. అంతేకాకుండా ఈ అబద్దానికి ఒక ప్రూఫ్కావాలి అని డెత్ సర్టిఫికెట్‌కు అప్లై చేసింది. అక్కడే జో దొరికి పోయింది. దీంతో పోలీసులు ఆమెకు జైలు శిక్ష విధించారు.
Also Read : అమరావతి మద్దతుదారులకు శుభవార్త.. హైకోర్టు కీలక తీర్పు