Home » ఉక్రెయిన్‌లోని న‌గ‌రాల‌ స్వాధీనం కోసం ర‌ష్యా య‌త్నం.. తిరగ‌బ‌డుతున్న యువ‌త‌..!

ఉక్రెయిన్‌లోని న‌గ‌రాల‌ స్వాధీనం కోసం ర‌ష్యా య‌త్నం.. తిరగ‌బ‌డుతున్న యువ‌త‌..!

by Anji
Ad

ఉక్రెయిన్‌లోని న‌గ‌రాల స్వాధీనం అంత సులువుగా ఏమి జ‌ర‌గ‌డం లేదు. అడుగ‌డుతునా ర‌ష్యా బ‌ల‌గాల‌కు స‌వాళ్లు ఎదుర‌వుతూ ఉన్నాయి. కానీ ర‌ష్య‌న్ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వెళ్తున్నారు. కీవ్‌, ఖార్కీవ్ ఈ రెండు న‌గ‌రాలే ఇప్పుడు ర‌ష్యా టార్గెట్‌. రెండింటినీ స్వాధీనం చేసుకుంటే.. మిగిలిన దేశం మీద ప‌ట్టు వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌తో బ‌ల‌గాలు ముందుకు క‌దులుతున్నాయి. అంత‌కంటే ముందే ఇత‌ర ప్రాంతాల‌కు మిలిట‌రీ మోహ‌రింపు జ‌రుగుతోంది. యుద్ధ ట్యాంక‌ర్లు, ఇత‌ర సైనిక వాహ‌నాలు ముందుకు క‌దులుతున్నాయి. ఆదారుల్లో ఉక్రెయిన్ బ‌ల‌గాలు ఉన్నాయా అన్న‌దాన్ని ర‌ష్యన్ హెలికాప్ట‌ర్లు గ‌గ‌న‌త‌లం నుంచి వీక్షిస్తూ ఆర్మీకీ సిగ్న‌ల్ ఇస్తున్నాయి. మ‌రొక వైపు ఉక్రెయిన్ దాడుల్లో ర‌ష్యా సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు. ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ విడుద‌ల చేసిన లెక్క‌ల ప్ర‌కారం.. వారం రోజుల్లో దాదాపు 500 మంది సైనికులు మ‌ర‌ణించారు.

Advertisement

కానీ ఉక్రెనియ‌న్లు మాత్రం 4వేలు మంది వ‌ర‌కు ర‌ష్య‌న్ల‌ను చంపామ‌ని ప్ర‌క‌టించుకున్నారు. ఉక్రెయిన్ వైపు 2వేల మంది పౌరులు చ‌నిపోయిన‌ట్టు ఆదేశ‌మే ప్ర‌క‌టించింది. మ‌రొక‌వైపు ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య ఈరోజు మ‌ళ్లీ చ‌ర్చ‌లు జ‌రుగ‌నున్నాయి. దౌత్య‌ప‌ర‌మైన ఈ చ‌ర్చ‌ల్లో ఉక్రెయిన్ అభ్య‌ర్థ‌న‌లేంటి..? ర‌ష్యా డిమాండ్లు ఏమిట‌నేది తేలాలి. ఈ రోజు ఫ‌లితం వ‌స్తుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. భార‌తీయుల‌ను ఉక్రెనియ‌న్లు బంధీలుగా ప‌ట్టుకున్నారంటూ ర‌ష్య‌న్ డిఫెన్స్ మినిస్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వారిని ర‌క్ష‌ణ క‌వ‌చంలా వాడుతున్నార‌ని ఆరోపించారు.

Advertisement

భార‌తీయులు వెంట‌నే ఉక్రెయిన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నారు. అవ‌స‌రం అయితే ర‌ష్యా బోర్డ‌ర్‌కు వ‌స్తే అక్క‌డి నుంచి సుర‌క్షితంగా భార‌త్‌కు త‌ర‌లిస్తామ‌న్న హామీ ఇచ్చారు. కానీ కీవ్‌, ఖార్కీవ్ నుండి ర‌ష్యా బార్డ‌ర్ వ‌ర‌కు వెళ్లే దారి క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే బ్రిడ్జీలు, రోడ్లు, సౌక‌ర్యాల‌న్నీ దెబ్బ‌తినడం ఓ కార‌ణ‌మైతే.. ర‌ష్య‌న్లు చూసి చూడ‌కుండా బాంబు దాడులు చేస్తుండ‌టం మ‌రొక కార‌ణం.

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారు జాగ్ర‌త్త‌లు పాటించాలి

Visitors Are Also Reading