Home » అమ‌రావ‌తి మ‌ద్ద‌తుదారుల‌కు శుభ‌వార్త‌.. హైకోర్టు కీల‌క తీర్పు

అమ‌రావ‌తి మ‌ద్ద‌తుదారుల‌కు శుభ‌వార్త‌.. హైకోర్టు కీల‌క తీర్పు

by Anji
Ad

అమ‌రావ‌తి రాజ‌ధాని కొన‌సాగించాల‌ని కోరుతున్న మ‌ద్ద‌తు దారుల‌కు శుభ‌వార్త అనే చెప్పాలి. మూడు రాజ‌ధానులు, సీఆర్‌డీఏ ర‌ద్దు పిటీష‌న్ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హై కోర్టు తాజాగా తీర్పు వెలువ‌రించింది. సీఆర్డీఏ చ‌ట్ట ప్ర‌కారం.. రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించాలి. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా అభివృద్ధి చేయాల‌ని, ఉన్న‌ది ఉన్న‌ట్టుగా అభివృద్ధి చేయాల‌ని కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

Also Read :  BCCI : ఆ కీల‌క ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ కాంట్రాక్టులో కేట‌గిరి మార్పు

Advertisement

Advertisement

సీఆర్‌డీఏ చ‌ట్టం ప్ర‌కారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించాల‌ని, 6 నెల‌ల్లో ఒప్పంద ప్ర‌కార‌మే అభివృద్ధి చేయాల‌ని పేర్కొంది. 3 నెల‌ల్లో రైతుల‌కు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్ప‌గించాల‌ని రైతుల‌కు అన్ని సౌక‌ర్యాల‌తో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాల‌ని తెలిపింది. అభివృద్ధి ప‌నుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ కోర్టుకు నివేదిక కూడా ఇవ్వాల‌ని పేర్కొంది.

ముఖ్యంగా రాజ‌ధాని అవ‌స‌రాల‌కు త‌ప్ప వేరే వాటికి భూములు ఇవ్వ‌వ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది. పిటీష‌న్ల ఖ‌ర్చు కోసం రూ.50వేలు ఇవ్వాల‌ని, కొంత మంది న్యాయ‌మూర్తులు ఈ కేసులు విచారించ‌వ‌ద్ద‌న్న పిటీష‌న్‌ను కొట్టేసింది. రాజ‌ధానిపై నిర్ణ‌యాలు చ‌ట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేద‌ని తేల్చి చెప్పింది హై కోర్టు.

Also Read :  వైర‌ల్ అవుతున్న బాల‌య్య వ‌సుంధ‌రల శుభ‌లేఖ‌…స్పెషాలిటీ ఏంటంటే..!

Visitors Are Also Reading