టీమిండియా వార్షిక కాంట్రాక్ట్ లిస్ట్ ప్రకటించింది బీసీసీఐ. నిన్న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఆటగాళ్ల గ్రేడ్లపై చర్చ జరిగింది. కొందరి గ్రేడ్లు తగ్గిస్తూ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టీమిండియా స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా, టెస్ట్ ఫార్మాట్ మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానె బీ గ్రేడ్‌లోకి పడిపోయారు. గత ఏడాది వరకు వీరిద్దరూ ఏ గ్రేడ్ ఆటగాళ్ల కేటగిరిలో ఉన్నారు. పుజారా, రహానే ఇద్దరూ గత కొద్దికాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నారు. దీంతో మార్చి 04 శ్రీలంకతో జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు వీరిద్ధరినీ పక్కన పెట్టారు. వారు రెగ్యులర్ క్రికెటర్ల జాబితాలో లేకుండా పోయారు.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారు జాగ్రత్తలు పాటించాలి
Advertisement
Advertisement
సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ గ్రేడ్ కూడా ఏ నుంచి బీ కి పడిపోయింది. ఇక వెన్నెముక గాయం కారణంగా భారతజట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఏకంగా ఏ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్‌కు పడిపోయాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం సీ గ్రేడ్‌లో ఉన్నాడు. సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమమాన్ సాహా, మయాంక్ అగర్వాల్ బీ నుంచి సీ గ్రేడ్‌లోకి వెళ్లిపోయారు. ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను బీసీసీఐ నాలుగు కేటగిరిలుగా విభజించింది. వీరిలో ఏ+ ఆటగాళ్లకు సంవత్సరానికి 7 కోట్లు, ఏ కేటగిరికి రూ.5 కోట్లు, బీ కేటగిరికి రూ.3కోట్లు, సీ కెటగిరికి రూ.1కోటి బీసీసీఐ చెల్లిస్తోంది. మొత్తం 27 మందితో బీసీసీఐ యాన్యువల్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. గత ఏడాది 28 మందికి అవకాశం ఇచ్చింది. నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్‌ను కాంట్రాక్టు లిస్ట్ నుంచి తొలగించారు.
గ్రేడ్ A+ : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.
గ్రేడ్ A : కే.ఎల్. రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్.
గ్రేడ్ B : చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్.
గ్రేడ్ C : శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్, హనుమవిహారి, యజ్వేంద్ర చాహల్, సూర్యకుమార్ యాదవ్, వృద్దిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్, దీపక్ చాహర్.
Also Read : ఉక్రెయిన్‌లోని నగరాల స్వాధీనం కోసం రష్యా యత్నం.. తిరగబడుతున్న యువత..!