పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. శుక్రవారం మార్చి 04 నుంచి రావాల్పిండిలో ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే పాక్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌కు కరోనా సోకింది. రవూఫ్ మార్చి 01 మంగళవారం వరకు పాకిస్తాన్ జట్టుతో ప్రాక్టిస్ చేశాడు. కరోనా పాజిటివ్ రావడంతో అతను ఐసోలేషన్‌కు వెళ్లాడు. మంగళవారం పాకిస్తానీ పేసర్ రౌఫ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించారు. పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత అతను వెంటనే హోటల్ గదిలో ఒంటరిగా ఉన్నాడు. ఓ వార్త సంస్థ తెలిపింది.
Also Read : ఆస్ట్రేలియా క్రికెటర్‌కు వింత అనుభవం.. టాయిలెట్లో చిక్కుకుపోయి..!
Advertisement
Advertisement
మంగళవారం పాకిస్తానీ పేసర్ రౌఫ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించారు. అది పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత అతను వెంటనే హోటల్ గదిలో ఒంటరిగా ఉన్నాడు. అయితే రవూఫ్ మంగళవారం ఉదయం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జట్టుతో కలిసి ప్రాక్టిస్ చేశాడు. మరొకవైపు సరైన సమయంలో మరింత సమాచారం అందుబాటులోకి వస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఊటంకిస్తూ ఓ నివేదిక పేర్కొంది. ఇటీవలే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎనిమిదో సీజన్ టైటిల్‌ను గెలుచుకున్న లాహోర్ క్వాలెండర్స్ జట్టులో హరీస్ రౌఫ్ సభ్యునిగా ఉన్నాడు. లాహోర్ క్వాలండర్స్ ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
జట్టు ఆటగాళ్లు తమ ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్‌ను కలవడానికి వెళ్లారు. అతను కరోనా లక్షణాల కారణంగా కొన్ని రోజులు ఒంటరిగా ఉన్నాడు. గత రెండేండ్లుగా పాకిస్తాన్ జట్టుతో తన స్థానాన్ని పదిలం చేసుకున్న రవూప్, ఇప్పటివరకు ఆ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడలేదు. అయితే ఇప్పటికే పాక్ జట్టు ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో ఈసారి ఆరంగ్రేటం చేస్తాడని అనుకున్నారు. ఆ జట్టు ప్రముఖ ఫాస్ట్ బౌలర్లు హాసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్ గాయాల కారణంగా తొలి టెస్ట్‌కు దూరమయ్యారు. ఇప్పుడు రవూఫ్ కూడా మ్యాచ్‌కు దూరం కానున్నాడు.
Also Read : ఐపీఎల్ నుంచి ఆ స్టార్ ఓపెనర్ ఔట్.. అందుకే ఎస్ఆర్హెచ్ తీసుకోలేదా..?