ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించిన తరువాత అంతర్జాతీయంగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయన ఆస్తులను ఫ్రీజ్ చేయడంతో పాటు పలు దేశాలు దౌత్య పరంగా కూడా రష్యాపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇక క్రీడా రంగంలోనూ రష్యాకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే ఫుట్‌బాల్‌కు సంబంధించి వరల్డ్ కప్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు, లీగ్‌లు రష్యా ఆడకుండా ఫిఫా నిర్ణయం తీసుకున్నది.
Advertisement
అదేవిధంగా పుతిన్‌కు సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్ష పదవీని కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా వరల్డ్ తైక్వాండో ఫెడరేషన్ కూడా పుతిన్‌కు బిగ్ షాక్ ఇచ్చినది. ఇప్పటివరకు పుతిన్‌కు ఉన్న తైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను ఫెడరేషన్ తొలగించింది. అదేవిధంగా రష్యాతో పాటు బెలారస్లో ఇక నుంచి ఎలాంటి తైక్వాండో పోటీలను, ఈవెంట్లను నిర్వహించమని అధికారికంగా ప్రకటించినది. ఈ విషయాన్ని తైక్వాండో ఫెడరేషన్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించినది.
Advertisement
Also Read : Russia Ukraine War : రష్యా దాడుల్లో భారత విద్యార్థి మృతి