Home » ప్ర‌భాస్ “రాధేశ్యామ్” స్టోరీ లీక్….చివ‌రి 20నిమిషాల క‌థ ఇదేన‌ట‌…!

ప్ర‌భాస్ “రాధేశ్యామ్” స్టోరీ లీక్….చివ‌రి 20నిమిషాల క‌థ ఇదేన‌ట‌…!

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస‌ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రభాస్ సినిమా ల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సాహో తర్వాత ప్రభాస్ మరోసారి ప్రయోగాత్మక చిత్రం రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించగా టి సిరీస్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించాయి.

Advertisement

సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడటంతో మళ్ళీ మార్చి 11 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే సినిమా టీజర్ , ట్రైలర్ లో ప్రభాస్ పామిస్ట్రీ పండితుడుగా కనిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ కు గురువుగా ప‌ర‌మ‌హంస పాత్ర‌లో కనిపిస్తున్నారు.

Advertisement

అయితే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను ప్రముఖ పామిస్ట్రీ పండితుడు చీరో క‌థ‌ నుండి ప్రేరణగా తీసుకున్నారట. చీరో అసలు పేరు విలియం వార్నర్ కాగా చీరో పేరుతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చీరో ఇండియాలో పామిస్ట్రీ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన లండన్ లో స్థిరపడ్డారు.

అయితే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ కూడా చివరి 20 నిమిషాల పాటు లండన్ లో చిత్రీకరించినట్టు గా సమాచారం. ఇక టీజర్, ట్రైలర్ లోనూ పామిస్ట్రీకి సంబంధించిన సన్నివేశాలు కనిపిస్తుండటంతో చీరో స్ఫూర్తితోనే కథను రాసుకున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ట్రైలర్ తో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

Visitors Are Also Reading