2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికీ భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ అభిమానుల హృదయాలను గెలుచుకుంటూనే ఉన్నాడు. నిస్సందేహంగా ఆల్‌టైమ్ బ్యాటర్‌గా పరిగణించబడుతున్న సచిన్ ఇటీవల బీచ్‌లో గాయపడిన పక్షిని రక్షించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సచిన్ పక్షిని పట్టుకున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పక్షి గొంతులో నీరు పోయడానికి బాటిల్ క్యాప్‌ను ఉపయోగించుకుని మరొక వ్యక్తిని కూడా చూడవచ్చు. 24 గంటల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోకు 12వేల లైకులు వచ్చాయి.
Also Read : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు సీఎం జగన్ మంచి చేశారు..ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంటర్..!
Advertisement
కొంచెం శ్రద్ధ ఆప్యాయత మన ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చుతుందని టెండూల్కర్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. 1989లో ఆరంగేట్రం చేసిన సచిన్ టెస్టులు, వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయంగా అత్యధిక పరుగులను సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు. 48 ఏండ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లో 34,357 పరుగులు చేశాడు.
టెస్ట్‌లు, వన్డేలలో కలిపి 51,49 మొత్తం 100 సెంచరీలు చేశాడు. ఇటీవల సచిన్ తన మార్ఫింగ్ ఇమేజ్‌ను వారి ప్రమోషన్ కోసం వినియోగించడంతో ఓ కాసినోపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మాస్టర్. ఇప్పటివరకు తాను ఎప్పుడూ కూడా మద్యపానాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యక్తిగత హోదాలో ఆమోదించలేదని.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నా చిత్రాలు ఉపయోగించడం చూసి చాలా బాధాకరమని ట్వీట్ చేశారు.
Also Read : చంద్రబాబు కోసం సొంత అన్ననే అవమానిస్తారా..? : కొడాలి నాని